పెన్షన్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారి ఖాతాల్లో సీఎం జగన్ మంగళవారం డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 'పెన్షన్ లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లంచాలు లేకుండా అర్హులకు పథకాలు అందిస్తున్నాం. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయి. ఏ పథకం రావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాం. పింఛన్లు అనర్హులకు రాకూడదు, ఇవ్వకూడదు. నోటీసులు ఇస్తారు, రీసర్వే చేసి చర్యలు తీసుకుంటారు. నోటీసులు ఇస్తేనే పింఛన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రీ వెరిఫికేషన్ లేకుండా చర్యలు తీసుకోరు' అని అన్నారు.