అన్ని వర్గాలకు వ్యతిరేకంగా విధానాలను అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సీపీఐ కర్నూలు జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పిలుపునిచ్చారు. సీపీఐ ఆవిర్భావ దినోత్స వాన్ని సోమవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో గిడ్డయ్య జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..... దేశంలో శ్రామికులను సమీకరించి యూనియన్లను ఏర్పా టు చేసి వారి హక్కుల కోసం పోరాడింది సీపీఐ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆస్తులన్నీ బీజేపీ ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్య వర్గసభ్యుడు కే.రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్. మునెప్ప, రసూల్, జిల్లా కార్యదర్శివర్గసభ్యుడు కే.జగన్నాథం, మహిళా జిల్లా నాయకురాలు జయలలిత, మనోహర్‌మాణిక్యం పాల్గొన్నారు.