ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నతల్లిపై కొడుకు అత్యాచారం.. బెదిరింపులు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 27, 2022, 03:07 PM

ఉత్తరాఖండ్ లోని పౌరీ జిల్లాలో సభ్య సమాజానికే మచ్చ తెచ్చిన ఘటన వెలుగుచూసింది. మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న పంకజ్ అనే యువకుడు కన్నతల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. డిసెంబర్ 25న సాయంత్రం కుమారుడికి ఆహారం పెట్టేందుకు తల్లి వెళ్లగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టి.. తీవ్రంగా దాడి చేసి చంపేస్తానని కూడా బెదిరించాడు. అడ్డు వచ్చిన తండ్రిని కూడా కొట్టాడు. ఈ విషయాన్ని బాధితురాలు కుమార్తెకు చెప్పగా తల్లీకూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com