సాధారణంగా చాలా పండ్లలో గింజలు ఉంటాయి. అయితే కొన్ని పండ్లలో వీటిని కప్పి ఉంచే ఒక చిన్న రాయి లాంటి దృఢమైన నిర్మాణం ఉండి, దాని చుట్టూ పండు గుజ్జు ఉంటుంది. ఇలాంటి పండ్లనే ‘స్టోన్ ఫ్రూట్స్’ అంటారు. మామిడి, పీచ్, ఆప్రికాట్స్, ప్లమ్స్, చెర్రీస్, రాస్బెర్రీ వంటివి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంపొందించే ఔషధ గుణాలు కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి, శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటుతో బాధపడే వారికి ఇవి మంచి ఔషధం. స్టోన్‌ఫ్రాట్స్‌లోని ఫైటోకెమికల్స్ వంటివి రక్త కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఫలితంగా క్యాన్సర్ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చు.