బ్రహ్మసముద్రం మండల పరిధిలోని వేపులపర్తి గ్రామంలో మంగళవారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ సీఎం వై. యస్. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో సియం వై. యస్ జగన్ మోహన్ రెడ్డి వెలుగు నింపారన్నారు. అన్ని వర్గాల బాగు కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగనన్నకే దక్కిందన్నారు.