ఇటీవలే డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ విడుదల చేసింది. దీన్ని రిటైల్, హాల్ సేల్ లావాదేవీలకు వినియోగిస్తూ, ప్రయోగాత్మకంగా కొన్ని పట్టణాల్లో పరీక్షిస్తున్నారు. ఈ రూపీపై మహాత్మా గాంధీ ఫోటో లేకపోవడంతో గాంధీ ముని మనవడు తుషార్ అరుణ్ గాంధీ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీపై బాపూ బొమ్మ వేయనందుకు ఆర్బీఐకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పుడు దయచేసి ఆయన ఫోటోని పేపర్ కరెన్సీపైనా తొలగించండి’ అంటూ వ్యంగ్యంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు.