మహారాష్ట్ర అసెంబ్లీ ఇవాళ కీలక తీర్మానం చేసింది. మరాఠీ భాష మాట్లాడే కర్ణాటకలోని 865 గ్రామాలను మహారాష్ట్రలో కలపనున్నారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కర్ణాటకతో సరిహద్దు వివాదం నేపథ్యంలో సీఎం ఏకనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామాలకు చెందిన ప్రతీ ఇంచును మహారాష్ట్రలో కలుపుతామని.. సుప్రీంకోర్టులో కావాల్సిన ఆధారాలు చూపిస్తామని మహా ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలోనూ బోర్డర్ అంశంపై ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.