విటమిన్ 'ఇ' అందానికి చాలా ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు పడుకునే అరగంట ముందు కొద్దిగా విటమిన్ 'ఇ' ఆయిల్‌ను చర్మానికి రాసుకుంటే పొడిబారకుండా ఉంటుంది. 'ఇ' నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి, ముడతలను దూరంగా ఉంచడమే కాక చర్మాన్ని బిగుతుగా, మెరిసేలా చేస్తాయి. ఇంట్లో పనుల వల్ల లేదా ఇతర కారణాల వల్ల గోళ్ల రంగు మారిపోతుంది. రోజూ రాత్రి కొన్ని చుక్కల విటమిన్ 'ఇ' నూనెను గోళ్లపై మృదువుగా మర్దనా చేయటం వల్ల తేమ అంది, విరగడం లాంటి సమస్యలూ ఉండవు. జుట్టుకు, పాదాల సంరక్షణకు కూడా ఈ నూనె బాగా పనిచేస్తుందట.