ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇల్లు, ఆఫీసుపై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయపోరాటం ప్రారంభిస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 27, 2026, 12:06 PM

వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు పార్టీ లీగల్‌ టీం సభ్యులతో  సమావేశమయ్యారు. గుంటూరు న‌గ‌రంలో తన ఇల్లు, ఆఫీసుపై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. దాడి ఘటనపై రేపటి నుంచి న్యాయపోరాటం ప్రారంభిస్తామని చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ నేత పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దహనకాండ దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తిని లెక్కచేయకుండా దాడులు జరిగాయని ఆరోపించారు. అంబటి రాంబాబు అరెస్టు విషయంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు సరైన విధానాలు పాటించలేదని ఆయన విమర్శించారు. మూడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లలో కూడా నిబంధనలు అనుసరించలేదని ఆరోపించారు. దాడి ఘటనలో పాల్గొన్నవారితో పాటు వారికి సహకరించిన పోలీసుల వీడియోలను సేకరిస్తున్నామని చెప్పారు. బాధ్యతలు నిర్వర్తించకపోవడం కూడా నేరమేనని, దాడి జరుగుతున్నప్పుడు అడ్డుకోని వారిని కూడా నిందితులుగా పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు. దాడికి పాల్పడిన వారికి స్టేషన్‌ బెయిల్‌ ఎలా ఇచ్చారనే విషయంపై కూడా న్యాయపోరాటం చేస్తామని, అంబటి రాంబాబును కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేశారని ఆరోపించారు. దీనిపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa