వాట్సాప్ వెబ్ సేవల్లో శుక్రవారం అంతరాయం ఏర్పడింది. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, వందలాది మంది వినియోగదారులు లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఐఫోన్ వినియోగదారులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొన్నారని నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 56% మంది వెబ్‌సైట్ సమస్యలను, 39% మంది యాప్ సమస్యలను, 6% మంది సందేశాలు పంపడంలో ఇబ్బందులను నివేదించారు. ఉదయం 8.37 గంటల నుండి ఈ సమస్య మొదలైంది. మెటా, వాట్సాప్ నుండి దీనిపై ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.అవుటేజ్ ట్రాకింగ్ సైట్ డౌన్‌డిటెక్టర్‌లో ఫిర్యాదులు హఠాత్తుగా పెరిగాయి. భారత్‌లో ఉదయం 9:00 గంటల సమయంలో రిపోర్టులు గణనీయంగా పెరిగాయి. ఉదయం 8:54 నాటికి కనీసం 16 మంది వాట్సాప్ ఫిర్యాదులు నమోదయ్యాయి. 30 నిమిషాల తర్వాత ఫిర్యాదుల సంఖ్య 28కి చేరింది. ఫిర్యాదుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.ప్రభావితమైన యూజర్లు Xలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సర్వీస్ పూర్తిగా డౌన్ అయిందా అని ప్రశ్నించారు. ఒక యూజర్ ఒక గంటకు పైగా లాగిన్ చేయడానికి ప్రయత్నించానని చెప్పాడు. వాట్సాప్ వెబ్‌ను ఫోన్‌తో లింక్ చేయడంలో ఇబ్బంది పడ్డామని చాలామంది చెప్పారు. మళ్లీ మళ్లీ ప్రయత్నించినా విఫలమవుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ రిపీటెడ్ ఫెయిల్యూర్లు యూజర్లలో గందరగోళం పెంచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa