వైసీపీ ప్రభుత్వం పై తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఫైరయ్యారు. మంగళవారం పెనుకొండ పట్టణంలోని సవితమ్మ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు లక్షలాది మంది పెన్షన్లు అన్యాయంగా తొలగిస్తున్నారన్నారు. పెన్షన్ సొమ్మును రూ 200 నుండి రూ 2000 వరకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు కి దక్కుతుందన్నారు. వైసిపి పార్టీ అధికారం వచ్చిన నాటి నుంచి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మాట మార్చి మడమ తిప్పాడు, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
పెనుకొండ నగర పంచా యతీలో పరిదిలోని ఇందిరమ్మ ఇంట్లో నివసిస్తున్న నిరుపేదకు 158 ఇళ్లు ఉన్నాయంటూ పింఛన్ నిలిపివేత నోటీసు అందజేశారని, ఇస్లాపురం గ్రామనికి చెందిన రామక్క రజక వృత్తి చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. భర్త నారాయణస్వామి పదేళ్ల క్రితమే మరణించారు. అప్పట్నుంచి రామక్కకు వితంతు పింఛన్ అందుతోంది. అయితే ఆమెకు 158 ఇళ్లు ఉన్నాయని , అవన్నీ 1, 30, 649 చదరపు అడుగుల విస్తీ ర్ణంలో ఉన్నాయని పింఛన్ నిలిపివేస్తున్నట్టు సచివాలయ ఉద్యోగులు నోటీసు అందించారు. ఈ పెన్షన్ల నిలిపివేసిన వారిని పరామర్శించి పెన్షన్ వచ్చే వరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు. తక్షణం పెన్షన్ తొలగించిన వారందరికీ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ అందించాలని లేకపోతే వదిలే ప్రసక్తి లేదన్నారు. చేతనైతే సంపద సృష్టించాలి కానీ నిరుపేదల పెన్షన్ తొలగించడం విడ్డూరమన్నారు.
పింఛన్ల తొలగింపు వెంటనే ఉపసహరించుకొని వారందరికీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుట్టూరు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, పెనుకొండ మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, త్రివేంద్ర నాయుడు, కౌన్సిలర్ గీతా హనుమంతు, వాసుదేవ రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.