బాంబు బెదిరింపులు ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేపాయి. సోమవారం 117 మంది ప్రయాణీకులతో ఓ స్పైస్ జెట్ జైసల్మేర్ నుంచి ఢిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకుంది. విమానం దిగే సమయంలో ఓ ప్రయాణీకురాలు వెనుకనున్న ఓ సీటుపై ‘ఈ విమానంలో బాంబు ఉంది’ అని హిందీలో సందేశాన్ని గుర్తించి సిబ్బందికి తెలియజేసింది. దీంతో ప్రయాణీకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భద్రతా దళాలు ప్రయాణీకులను ఖాళీ చేయించి 2 గంటలు తనిఖీలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించారు.