కందుకూరులోని శతాబ్దాల నాటి ప్రాచీన ప్రసిద్ధి స్కందపురి జనార్ధన స్వామి ఆలయానికి నిర్మిస్తున్న ఐదంతస్తుల రాజగోపురం నత్తనడకన సాగుతున్నది. 80 లక్షల కు పైగా వ్యయంతో నిర్మిస్తున్న రాజగోపురం కనీసం ఈ ఏడాది జరిగే ముక్కోటి పర్వదినానికైనా సిద్ధమవుతుందని భక్తులు ఆశించారు. రాజగోపురం నిర్మాణం నత్తనడక కారణంగా వైకుంఠ ఏకాదశి నాడు జరిగే స్వామి వారి పవిత్ర ద్వార దర్శనం గడచిన ఆరేళ్ళుగా జరగడం లేదు. స్వామివారిని అలంకరించి మొక్కుబడిగా ఆలయంలోని సభా మంటపంలోనే నిలిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. త్వరలో రాజగోపురం నిర్మాణం పూర్తికావించి స్కంధపురి జనార్దన స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.