మైదుకూరు పట్టణంలోని కడప రోడ్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 8వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ట్యాబ్ల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురాం రెడ్డి, మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర హాజరై విద్యార్థులకు ట్యాబ్ల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైదుకూరు తహశీల్దారు, ఎంపీడీవో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.