చాపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో మంగళవారం విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీచేయు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి హాజరై
354 మంది ట్యాబ్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పిల్లలకు నాణ్యమైన చదువులు ఇవ్వడమే సీఎం జగన్ లక్ష్యం అని, ఏ. పీ లో విద్యార్థుల కోసం సీ. ఎం జగన్ అందిస్తున్న సౌకర్యాలు ఏ ఇతర రాష్ట్రాలలో ఎవ్వరు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. పేద విద్యార్థులకు గ్లోబల్ సిటిజన్ లుగా తీర్చిదిద్దేలా, పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా బైజుస్ కంటెంట్ తో ట్యాబ్ లను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.