జగనన్న పాలనలో సంక్షేమ విప్లవం కొనసాగుతోందని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం లక్కిరెడ్డిపల్లె మండలం లక్కిరెడ్డిపల్లె 1, 2 గ్రామ సచివాలయాల పరిధిలో పుల్లారెడ్డి వీధి, సెల్వరాజ్ వీధి, బైపాస్ రోడ్డు, అమరావతి స్కూల్ ఏరియా, వైఎస్ఆర్ సిపి కార్యాలయం స్ట్రీట్, మనీషా స్కూల్ వీధి, వెంకట రెడ్డి వీధి, టీచర్స్ కాలనీ, డి సి సి బ్యాంకు ఏరియా, స్టేట్ బ్యాంకు వీధులలో ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపిపి అంపాబత్తిన రెడ్డెయ్య లతో కలసి గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామంలోని పల్లెల్లో ప్రతి గడప కూ శ్రీకాంత్ రెడ్డి వెళ్లి ప్రజా సమస్యలు ఆరా తీయడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మరింత మెరుగైన పాలన సాగించేందుకు, ప్రజా సనస్యలును తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ మూడేళ్ళ కాలంలో తొంభై ఎనిమిది శాతానికి పైగా సీఎం జగన్ నెరవేర్చారన్నారు. అర్హతే ప్రామాణికంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. ఆదర్శంగా, పారదర్శకంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. పేదలు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పెద్దపీట వేయడం జరుగుతోందన్నారు.