దివ్యాంగుల పింఛన్లు తొలగింపు సరికాదని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ మదర్ ధెరిసా దివ్యాంగుల సేవా సమితి ఉపాధ్యక్షుడు మహమ్మద్ భాష బదిరుల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మి కిషోర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం వారు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల తనిఖీల్లో భాగంగా అనేక వికలాంగుల పింఛన్లు తొలగించబడ్డాయని, కావున దయచేసి ప్రభుత్వం వారు పెన్షన్లు తిరిగి పునరుద్దించాలని వికలాంగులందరి తరపున కోరారు. విభిన్న ప్రతిభావంతులకు ఎటువంటి పనులు చేసుకోలేరని, కాబట్టి ఎంతసేపు ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్ల మీద జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి విభిన్న ప్రతిభావంతులకు భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు వెంకటసుబ్బయ్య, అల్తాఫ్, అస్లాం, హనుమంత్, ఖాజా, హుస్సేన్ సా మరియు బాధితులు పాల్గొన్నారు.