చాలా దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ వారంలో 11 శాతం కొత్త కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది దేశంలో నాల్గవ తరంగానికి సంకేతమా అనేది స్పష్టంగా లేదు. కరోనా వైరస్ జన్యురూపాంతరం చెంది సబ్ వేరియంట్ల రూపంలో వ్యాప్తి చెందడం సహజంగా జరిగే ప్రక్రియ అని, కొత్త వేరియంట్‌ను అంచనా వేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు.