తలనొప్పి అనేది మనలో సాధారణ సమస్య. మరియు చలికాలంలో ఈ సమస్య కొందరికి మరీ ఎక్కువ. కేవలం ఇంటి చిట్కాలతోనే తలనొప్పిని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. గోరువెచ్చని పాలలో లవంగాలు, కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే దాల్చిన చెక్కను పేస్టులా చేసి నుదిటిపై రాసుకుంటే మంచిదని చెబుతారు. గోరువెచ్చని పాలలో తులసి, పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.