ఢిల్లీ మేయర్ పోటీలో తాము ఉండబోమని గతంలో ప్రకటించిన బీజేపీ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. షాలీమార్ బాగ్ కౌన్సిలర్ రేఖాగుప్తాను మేయర్ అభ్యర్థిగా, రామ్ నగర్ కౌన్సిలర్ అభ్యర్థి కమల్ బగ్రిను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆప్ నుంచి షెల్లీ ఒబెరాయ్, ఇక్బాల్ లు అభ్యర్థులుగా ఉన్నారు. జనవరి 6న ఎన్నికలు జరగనున్నాయి. ఎల్జీ ప్రకటించే నామినేటెడ్ సభ్యుల ఓట్లపై బీజేపీ ఆధారపడుతోంది. కాగా, మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.