తలనొప్పి మనలో సర్వ సాధారణంగా కనిపించే సమస్య. ఇక శీతాకాలంలో ఈ సమస్య కొందిరికి మరీ ఎక్కువ. ఈ క్రమంలో కేవలం ఇంటి చిట్కాలతో తలనొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని పాలలో లవంగాలు, కొంచెం ఉప్పు వేసుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు. అలాగే, దాల్చిన చెక్కను పేస్టులా చేసి నుదుటిపై రాసుకున్నా.. ఆ చెక్కను టీలో కలుపుకొని తాగినా మంచి ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే గోరువెచ్చని పాలల్లో తులసి, పసుపు వేసుకుని తాగినా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.