సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి దేశ అప్పుల భారం రూ.147.19 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది జీడీపీలో 89.1 శాతానికి సమానమని తెలిపింది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో రుణ పత్రాల జారీ ద్వారా రూ.4.06 లక్షల కోట్ల అప్పును కేంద్రం చేయగా, ఇందులో రూ.92,371 కోట్లు పాత అప్పుల చెల్లింపులకే సరిపోయింది. అలాగే సగటు వడ్డీ రేటు 7.23 శాతం నుంచి 7.33 శాతానికి చేరింది. దీని ప్రకారం ప్రతి పౌరుడి తలపై రూ.లక్ష వరకూ అప్పు ఉందని తెలుస్తోంది.