సుప్రీం కోర్టులోని సీనియర్ న్యాయవాదులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ల వల్ల జూనియర్లకు కేసులు రావడం లేదన్నారు. సీనియర్లు ఒక్కరోజు వాదనలు వినిపించడానికి రూ.30 లక్షల నుండి రూ.40 లక్షలు తీసుకుంటున్నారని, మరోవైపు కొందరికి కేసులే దొరకడం లేదని అన్నారు. పెద్ద కేసులన్నీ కొందరి వద్దకే వెళ్లడంతో వారే కోట్లు సంపాదిస్తున్నారని, జూనియర్లకూ ఎదిగే అవకాశం ఇవ్వాలని కేంద్రమంత్రి పేర్కొన్నారు.