ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయంలో అర్హత కలిగిన ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా రూ. లక్షల్లో లబ్ధి చేకూరిందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. నరసన్నపేట మండలం సత్యవరం సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. 2019 నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎవరెవరికి ఎంత మేరకు లబ్ధి చేకూరిందో గణాంకాలతో సహా వివరించారు. స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరించదగ్గ సమస్యలపై అక్కడిక్కడికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మళ్లీ వస్తేనే తమకు మరింత మేలు జరుగుతుందన్న బలమైన నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. గతంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అధికారులు కూడా ప్రభుత్వ పథకాల అమలులో అర్హులను గుర్తించి
న్యాయం చేయాలని, పథకాలు వర్తింపులో నిర్లక్ష్యం వహించరాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ మెంబర్ ధర్మాన పద్మప్రియ, ఎంపీపీ అరంగి మురళీధర్, జడ్పిటిసి చింతు రామారావు, నరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బూరెల్లి శంకర్రావు, సుడా కార్పొరేషన్ అధ్యక్ష ప్రతినిధి కోరాడ చంద్రభూషణ గుప్తా, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ బొబ్బాది ఈశ్వరరావు, ఎంపీటీసీలు వైశ్యరాజు కేశవరాజు, నాగ వంశపు శ్రీనివాసరావు, సర్పంచులు పోలాకి నరసింహమూర్తి, అవ్వ రవీంద్ర రెడ్డి, అసిరి నాయుడు, అధికారుల సాంబమూర్తి, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు సురంగి నర్సింగరావు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.