అమెరికాలోని బాంబ్ సైక్లోన్ విధ్వంసం సృష్టిస్తోంది. మంచు తుపాను ధాటికి ఇప్పటివరకూ 66 మంది మరణించినట్లు సమాచారం. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 8 నుంచి 48 డిగ్రీల వరకూ పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు భయానకంగా ఉన్నాయి. రహదారులపై మంచు దిబ్బల్లా పేరుకుపోయింది. బఫెలో నగరంలోనే 34 మంది మృతి చెందగా.. ఇక్కడ 50 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. 17 లక్షల మందికి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. 4 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. అయితే ఈ వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.