అస్సాంలో వడగండ్ల వాన భీభత్సం సృషిస్తోంది. ఎగువ అస్సాంలోని నాలుగు జిల్లాలను మంగళవారం నాడు వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. ఈ వడగండ్ల వాన కారణంగా 132 గ్రామాల్లోని 4500 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన శాఖ తెలిపింది. దాదాపు 18వేల మంది నిరాశ్రయులయ్యారని, వారికి తాత్కాలిక ఆవాసం కోసం టార్ఫాలిన్ పట్టాలను అందజేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, సోమవారం అర్థరాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు వడగండ్ల వాన భీభత్సం సృష్టించడంతో పాఠశాలలు, వ్యవసాయ పంటలు సైతం దెబ్బతిన్నట్లు వెల్లడించారు.