ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 28, 2022, 04:35 PM

పింఛన్ల విషయంలో ఎవరైనా దుష్ప్రచారం చేస్తే ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా ఖండించాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు.సీఎం జగన్ రెడ్డి హయాంలో 'తిట్లు తిట్టు-పోస్టు పట్టు' కార్యక్రమం కొనసాగుతోందని ఆయన సెటైర్లు వేశారు. ప్రతిపక్షాలను తిట్టాలని జగన్ రెడ్డి కలెక్టర్లకు చెబుతున్నారని అన్నారు. కలెక్టర్లు ఎవరినైనా తిడితే పరిణామాలు మరోలా ఉంటాయని రఘురామ స్పష్టం చేశారు. ఆరు నెలల కిందటే ఉన్న పింఛన్ల అర్హత ఇప్పుడు ఎలా పోతుందని ప్రశ్నించారు. పాలకులు తప్పులు చేస్తుంటే మీడియాపై నిందలు వేయడం సరికాదని హితవు చెప్పారు. పింఛన్లు పెంచుతామని చెప్పి ప్రజలను మోసం చేశారని రఘురామ విమర్శించారు. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com