కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో టెస్టులు చేస్తుండగా.. 13 మంది విదేశీ ప్రయాణీకులకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో విమానాశ్రయం నుంచి సప్ధర్ జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి వైరస్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. వీళ్లను అసింప్టమేటిక్ గా అనుమానిస్తున్నారు. ఈ ఎయిర్ పోర్టుల్లో నిత్యం పరీక్షలు చేస్తూనే ఉన్నారు.