ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు. వీటికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.