ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో నయాగరా జలపాతం ఒకటి. న్యూయార్క్-కెనడా దేశాల మధ్య ఈ జలపాతం అందాలు వర్ణణాతీతం. అయితే, ప్రస్తుతం ఈ జలపాతం గడ్డకట్టుకుపోయింది. అమెరికా, న్యూయార్క్ నగరాల్లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అక్కడ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అగ్రరాజ్య వ్యాప్తంగా ఎటు చూసిన మంచు గడ్డలే దర్శనమిస్తున్నాయి. దీంతో నయాగరా అందాలు సైతం గడ్డ కట్టుకుపోయాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.