ప్రస్తుత రోజుల్లో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడమనేది సర్వ సాధారణమయిపోయింది. అయితే ఒక్కోసారి హోటళ్ల నిర్లక్ష్యం కారణంగా భోజనంలో పురుగులు, కుళ్లిన ఆహారం వచ్చి ఆర్డర్ చేసినవారు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వ్యక్తి హోటల్ కి వెళ్లి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే దాంట్లో మాంసం ముక్కలు వచ్చాయి. మధ్య ప్రదేశ్ ఇండోర్ కు చెందిన అక్షయ్ దూబే అనే వ్యక్తి విజయ్ నగర్ లోని ఓ రెస్టారెంట్ కి వెళ్లి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఫుడ్ వచ్చాక అతడు తింటుండగా బిర్యానీలో మాంసం బొక్కలు కనిపించాయి. ఈ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు పొరపాటుకు క్షమాపణలు తెలియజేశారు. అంతేకాక, అక్షయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శాఖాహారులకు మాంసాహారం అందిస్తున్నారని రెస్టారెంట్ యజమాని స్వప్నిల్ గుజరాతీపై పోలీసులు కేసు నమోదు చేశారు.