ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అస్వస్థకు గురైన హీరాబెన్ మోదీ... త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Wed, Dec 28, 2022, 05:00 PM

ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసర్చ్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు బులెటిన్ ద్వారా వెల్లడించారు. అయితే, అనారోగ్యానికి గల కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు. మరోవైపు ఈ బాధాకరమైన సమయంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. 


ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ... తల్లీకొడుకుల మధ్య అనుబంధం అన్నిటికీ అతీతమైనదని, వెలకట్టలేనిదని చెప్పారు. మోదీ గారూ, ఈ కష్ట సమయంలో మీకు నా ప్రేమ, మద్దతు వుంటాయని అన్నారు. మీ మాతృమూర్తి త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవలే హీరాబెన్ 99వ పుట్టినరోజును జరుపుకోవడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com