దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF.7 కలవర పెడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక సూచనలు చేశాయి. రాబోయే 40 రోజులు చాలా కీలకమని పేర్కొన్నాయి. జనవరిలో మధ్యలో కేసులు తీవ్రమయ్యే ముప్పు పొంచి ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించాయి. గతంలోనే ఇదే సమయంలో వైరస్ తీవ్రరూపం దాల్చిందని గుర్తుచేశాయి. ఈ మేరకు రాష్ట్రాలు సైతం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నాయి.