ఏపీలో అగ్రవర్ణ పేద (ఈబీసీ) మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం 'ఈబీసీ నేస్తం' పథకం అమలు చేస్తోంది. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉండే మహిళల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ చేయనుంది. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10 వేలు దాటకూడదు. మాగాణి భూమి 3 ఎకరాలు, మెట్టభూమి 10 ఎకరాలు కంటే ఎక్కువ ఉండకూడదు. కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్‌దారులు, ఫోర్ వీలర్ కలిగి ఉన్నవారు, ఆదాయపన్ను కడుతున్న వారు అనర్హులు. త్వరలో అర్హుల ఖాతాలలో డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. మరిన్ని వివరాలకు గ్రామ సచివాలయాలను సందర్శించవచ్చు.