ఒకప్పుడు అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు ఆ పోలీస్ ఉన్నతాధికారి. అనూహ్యంగా ఇప్పుడు స్లిమ్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. దిల్లీలో డీసీపీగా పనిచేస్తున్న జితేందర్ మణి కేవలం 8 నెలల్లోనే 46కిలోల బరువు తగ్గి స్లిమ్ కాప్‌లా మారిపోయారు. కేవలం కఠినమైన ఆహార నియమాలు, కసరత్తులతోనే ఇంతగా ఫిట్నెస్ సాధించారు. రోజూ 15వేల అడుగులు వాకింగ్ చేసేవారు. అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన అన్నం, రోటీలు వంటి ఆహారం నుంచి సూప్‌లు, సలాడ్లు, పండ్లు వంటి అధిక పోషకాలు ఉండే ఆహారానికి మారారు. దీంతో 130కిలోల బరువు నుంచి 84 కిలోలకు తగ్గారు.