స్మార్ట్‌మీటర్ల తయారీ వ్యాపారంలోకి గౌతమ్ అదానీ ప్రవేశించారు. ఇందుకోసం బెస్ట్ స్మార్ట్‌మీటరింగ్ లిమిటెడ్ (BSML) అనే సంస్థను నెలకొల్పారు. కంపెనీస్ రిజిస్ట్రార్ వద్ద నమోదైందని, కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదని అదానీ గ్రూప్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (RDSS) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. డిస్కమ్‌ల కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపర్చడం, అవి ఆర్థిక స్థిరత్వం సాధించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్రం చెప్పింది.