అవినీతి కేసులో ఏడాదికి పైగా జైలులో ఉన్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ (73) ఈరోజు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను తప్పుడు కేసులో ఇరికించారని హైకోర్టు కూడా అభిప్రాయపడింది. ప్రతి నెలా బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్ముఖ్ ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. ఈ కేసులో అనిల్ 2021 నవంబర్ నుంచి జైలులో ఉన్నాడు.