మెక్సీకోలో పోలీసులు రోడ్డుపై సాధారణ తనిఖీలు చేస్తుండగా ఓ కారు వచ్చింది. పోలీసులను చూసి ఆపకుండా ముందుకు పోవడంతో పోలీసులు వెంబడించి కారును ఆపారు. అనంతరం కారు డిక్కీ ఓపెన్ చేసి చూడగా సూట్ కేస్, బ్యాగుల మధ్య పులిపిల్లను చూసి షాక్ అయ్యారు. డిక్కీలో పులి పిల్లతో పాటు తుపాకులు, బుల్లెట్లు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు కారులోని దంపతులను అరెస్టు చేసి, పులిపిల్లను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మెక్సికోలో డ్రగ్ ట్రాఫికర్లకు పులులు, సింహాలను పెంచుకోవడం సరదా. వాటిని అక్రమంగా కొనుగోలు చేసి పెంపుడు జంతువుల్లా ఇళ్లలో పెంచుకుంటారు.