కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల సమయంలో ఓటర్లు తమ సొంత ఊరికి వెళ్లి ఓటు వేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. అందుకు అనుగుణంగా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కు సంబంధించిన నమూనాను రూపొందించారు. దీనిని జనవరి 16న ప్రదర్శించనున్నారు. దీని ప్రదర్శన కోసం రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. దీంతో వలస వచ్చిన ప్రజలకు పెద్ద ఉపశమనం కలగనుంది.