ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతుల కుటుంబాలకు 23 లక్షల ఆర్థికసాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 01:05 PM

నెల్లూరు జిల్లా కందుకూరు తొక్కిసలాటలో మృతిచెందిన 8 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.23 లక్షల ఆర్థిక సాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మృతుస కుటుంబాలకు పార్టీ తరపున రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేస్తామని తొలుత ప్రకటించగా, తాజాగా ఆ మొత్తాన్ని 23 లక్షలకు పెంచారు. పార్టీ ప్రకటించిన 10 లక్షల స్థానంలో 15 లక్షలు అందజేయనున్నారు. దీంతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా వ్యక్తిగతంగా సాయం ప్రకటించారు. దీంతో పార్టీ నేతలు ప్రకటించిన 8 లక్షలు కలుపుకొని మొత్తం రూ.23 లక్షలు అందజేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com