ఈ మధ్య కాలంలో చాలామందిని మధుమేహ సమస్య వేధిస్తుంది. అయితే జామ ఆకులతో షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జామ ఆకుల రసంలో యాంటీ-హైపర్గ్లైసీమిక్ లక్షణాలు ఉంటాయట. దీని వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో వుంచుకోవచ్చు. దీనిలోని ఫినాలిక్ శరీరంలో ఉత్పత్తి అయ్యే అదనపు చక్కెరను నియంత్రించడానికి పనికొస్తుంది. అలిమెంటోథెరపీగా కూడా జామ ఆకులు ఉపయోగ పడతాయి. హైపోడిపోనెక్టినిమియా, హైపర్గ్లైసీమియా కూడా ఇంప్రూవ్ అవుతాయట. అంతే కాక జామా ఆకు తో టీ తాగడం వల్ల విరేచనాలు తగ్గుతాయి. అలానే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.