నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ చంద్రబాబుపై కందుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై 304A, 174 సెక్షన్ల ప్రకారం కేసు పెట్టాలన్నారు. వెయ్యి- రెండు వేల మంది పట్టే స్థలంలో 50-60 వేల మందిని పిలిచారని ఆరోపించారు. చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. చంద్రబాబు టీడీపీకి వెంటనే రాజీనామా చేసి, రాజకీయాలకు స్వస్తి చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.