రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(CIS) దేశాధినేతలకు గోల్డ్ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశంలో మొత్తం 8 మంది దేశాధినేతలకు ఆయన ఉంగరాలను ప్రజెంట్ చేశారు. ఆ ఉంగరాలపై కామన్‌వెల్త్ గుర్తుతో పాటు హ్యాపీ న్యూ ఇయర్ 2023 అని ప్రింట్ చేసి ఉంది. సమావేశం జరుగుతున్న రష్యా దేశం పేరు కూడా ఆ రింగ్‌లపై ఉన్నది. బెలారస్, అజర్‌బైజాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్కమిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులకు, అర్మేనియా ప్రధానికి పుతిన్ బంగారు ఉంగరాలను అందజేశారు. పుతిన్ గోల్డ్ రింగ్ గిఫ్ట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ జోకులు వైరల్ అవుతున్నాయి.