ఆధ్యాత్మిక గురువు దలైలామా గురువారం బీహార్లోని బుద్ధగయను సందర్శించారు. ఈ రోజు ఉదయం కాలచక్ర మైదానంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. డిసెంబర్ 31 వరకు ఈ సభ జరగనుంది. అయితే దలైలామా రాకతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనధికారంగా ఇక్కడ రెండేళ్లుగా నివసిస్తున్న చైనా మహిళ సాంగ్ జియోలాన్ను పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఈమెకు సంబంధించిన వివరాలు విదేశీ విభాగం రికార్డుల్లో లేవు. దాంతో ఈమెను చైనా గూఢచారిగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో స్పైగా అనుమానిస్తున్న మహిళా వీసా, పాస్పోర్ట్, స్కెచ్ వివరాలను మీడియాకు వెల్లడించారు.