దళితులకు సరఫరా చేసే నీటి ట్యాంకులో మానవ మలాన్ని పడేసి పైశాచిక ఆనందం పొందారు కొందరు దుండగులు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని పుడుకొట్టయి జిల్లాలో వెలుగు చూసింది. 100 మంది దళిత కుటుంబాలు నివసించే ఇరయూర్లో ఇటీవల చాలా మంది పిల్లలకు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కలుషితమైన నీటిని తాగడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని, ఒకసారి ట్యాంక్‌ను పరిశీలించాలని గ్రామస్తులకు వైద్యులు సూచించారు. ట్యాంక్‌ను పరిశీలించగా, అధిక మొత్తంలో మానవ మలం ఉన్నట్లు గుర్తించారు. షాకైన దళితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.