ఛాయ్, సమోసా అంతా ఇష్టపడతారు. ఎక్కడైనా మహా అయితే వీటి ధర రూ.50కు మించదు. అయితే ముంబై ఎయిర్ పోర్టులో మాత్రం ధరలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముంబై చత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఓ ఛాయ్, 2 సమోసా, వాటర్ బాటిల్ కు రూ.499 బిల్ వేశారు. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్ట్ ఫరా ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే క్యాప్షన్ పెట్టారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.