ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఘటనలో ప్రధాన దోషి చంద్రబాబే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 08:08 PM

చంద్రబాబు ప్రచార పిచ్చి, అధికార దాహం, లేనిది ఉన్నట్టుగా చూపించాలనే ప్రయత్నం 8 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. కందుకూరు మరణాలు చంద్రబాబు చేసిన హత్యలేనని, ఈ ఘటనలో ప్రధాన దోషి చంద్రబాబేనని, ఎఫ్‌ఐఆర్‌ కట్టి.. సమగ్ర విచారణ జరపాల్సిందేనని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సభకు విపరీతమైన జనాలు వచ్చారని చూపించుకోవాలనే పబ్లిసిటీ పిచ్చితోనే కూలీకి వచ్చిన 8 మంది అమాయకులు చనిపోయారని, మరో 5గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఎన్ని పొరపాట్లు చేయాలో అన్నీ చంద్రబాబు చేశాడని, చనిపోయిన వారి కుటుంబానికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, సంతాపం, నీ విచారం ఆ కుటుంబానికి పోయిన ప్రాణాలను తెచ్చి ఇవ్వగలదా..? అని నిలదీశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa