అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విరుద్ధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని దండి వీధిలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం పై కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని,రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు విరుద్ధంగా అసత్య ప్రచారం సాగుతున్నదని అన్నారు. మీ ప్రతినిధిగా మీకు నిజాలు చెప్పాల్సిన బాధ్యతతో తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa