జిల్లావ్యాప్తంగా గురువారం మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 40 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ మల్లికా గర్గ్ మాట్లాడుతూ రానున్న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వాహనాల ప్రమాదాల నివారణ లక్ష్యంగా బ్రీత్ ఎనలైజర్ యంత్రం ద్వారా వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు.