ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలపై రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆగేపాటి అమరనాథరెడ్డి శుక్రవారం వాలంటీర్లతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారని ఆయన సలహాదారుడు గురువారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తోలుత రాజంపేట మండలంలోని సిటీ కళ్యాణ మండపంలోనూ, నందలూరు ఎంపీడీవో కార్యాలయంలోనూ, ఒంటిమిట్ట షాదీ ఖానా కళ్యాణమండపంలోనూ, సిద్ధవటం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో వరుసగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వాలంటీర్లు అందరూ తప్పక హాజరు కావాలని వారు సూచించారు.